VIDEO: విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన హిజ్రాలు
RR: షాద్‌నగర్ పట్టణంలోని సీఎస్కే విల్లాస్‌లో నివాసముంటున్న కొంతమంది హిజ్రాలు శనివారం విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. గత కొన్ని రోజులుగా సీఎస్కే విల్లాస్ ఫేజ్-2లో యాజమాన్యం నిర్వాకం కారణంగా కరెంటు సరఫరా నిలిపివేశారు. కరెంటు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దీనిపై తక్షణమే స్పందించాలని కోరారు.