జంగారెడ్డిగూడెంలో అధ్యాపకుల ఆందోళన

ELR: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట భోజన విరామ సమయంలో పలువురు అధ్యాపకులు నల్ల బ్యాడ్జిలతో నిరసన చేపట్టారు.అధ్యాపకులు బదిలీలు తక్షణమే చేపట్టాలని రీజిగ్నేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 42 రద్దు చేసి అధ్యాపకుల పెండింగ్ సమస్యలు అన్నింటిని తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్‌కు వినతి పత్రం అందించారు.