'ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది’

'ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది’

KNR: కరీంనగర్‌లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు.