ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

NRML: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, అగ్నిమాపక పరికరాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.