చేసిన సేవలే గుర్తింపునిస్తాయి: ఉద్యోగులు

చేసిన సేవలే గుర్తింపునిస్తాయి: ఉద్యోగులు

SKLM :విధి నిర్వహణలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయని పలువురు ఉద్యోగులు అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించిన వాకాడ వెంకటరావు ఇటీవల పదవీవిరమణ పొందడంతో తోటి ఉద్యోగులు ఆయనను సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ శ్రీరామ్ మూర్తి, ఎంపీడీవో రాజారావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.