అడివి శేష్ 'డెకాయిట్' అప్‌డేట్
అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డెకాయిట్'. ఈ చిత్రంలోని రెండో పాట 'చిచ్చుబుడ్డి'ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటలో సింగర్ జోనితా గాంధీతో కలిసి అడివి శేష్ మాస్ స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ పాటను రామ్ మిరియాల, జోనితా గాంధీ ఆలపించారు.