టీడీపీ ప్రధాన కార్యదర్శుల పేర్లు ఖరారు!
AP: టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షుల పదవులకు పేర్లు దాదాపు ఖరారయ్యాయి. చట్టసభలకు ఎన్నిక కానివారు, నామినేటెడ్ పోస్టులు దక్కనివారు ఈ పదవులకు పోటీ పడ్డారు. వీరిలో కొందరి పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలో దీనిపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముంది.