VIDEO: చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం

VIDEO: చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం

HYD: ఫిలింనగర్ PS పరిధిలోని ఓయూ కాలనీలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడు వల్లు తేజ నందన్‌పై ట్యూషన్ టీచర్ దాష్టీకానికి పాల్పడింది. చదవడం లేదనే కారణంతో బాలుడి చేతులు, కాళ్ళు, ముఖంపై అట్లకాడతో ఏకంగా 8 చోట్ల వాతలు పెట్టింది. ఈ విషయంపై ఫిలింనగర్ PS లో ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.