పండుగ వేళ పూల ధరలకు రెక్కలు

పండుగ వేళ పూల ధరలకు రెక్కలు

GNTR: దసరా పండుగ వేళ తెనాలి మార్కెట్లో పూలకు డిమాండ్ భారీగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లుగానే ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. విడి పూలు కిలో రూ. 500 పైనే విక్రయిస్తుండగా ఒక మూర మాల రూ.30-40 మధ్య ధర పలుకుతోంది. రూ. 50 ఇచ్చినా గుప్పెడు పూలు కూడా చేతికి రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు కొబ్బరికాయలు ఇతర పూజ సామాగ్రి ధరలు పెరిగాయి.