కల్తీ నెయ్యి కేసులో విచారణకు ధర్మారెడ్డి
తిరుమల కల్తీ నెయ్యి కేసులో మాజీ టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. అలిపిరి సమీపంలోని సీబీఐ సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన భద్రతా వలయంలో లోపలికి చేరుకున్నారు. సిట్ డీఐజీ మురళీ రంభ ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. రెండు రోజులు పాటు విచారణ జరగనుంది.