కోమాలో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ..?
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో నిర్ణయాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నాయి. ఈ మేరకు అమెరికా-ఇజ్రాయెల్‌కు నిఘా సమాచారం ఉన్నట్లు తెలిపాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ నాయకత్వంపై ఈ వార్తలు రావడం సంచలనంగా మారింది.