స్వర్ణ ప్రాజెక్టుకు స్వల్ప వరద ప్రవాహం

NRML: సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు స్వల్ప వరద వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 359 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పూర్తి స్థాయి నీటిమట్టం 360.56 మీటర్లు కాగా ప్రస్తుతం 360.51 మీటర్లకు చేరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 8,945 ఎకరాలకు సాగునీరు అందుతోంది.