అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

JGL: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పెగడపెల్లి మండలం లింగాపూర్ గ్రామంలో సుమారు రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు, రూ. 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఆర్డివో మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.