నేడే జాతీయ లోక్ అదాలత్
అన్నమయ్య: వాల్మీకిపురం మండలంలోని స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో నేడు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కక్షిదారులంతా పెండింగ్ కేసులు రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు ఇంఛార్జ్ జడ్జి శ్రీకాంత్ సూచించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ కేసులతో సతమతమవుతున్న కక్ష దారులంతా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.