గాజు గ్లాసు గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించండి: ఎమ్మెల్యే అభ్యర్థి పంతం

తూ. గో: కరప మండలం సిరిపురం గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ పాల్గొన్నారు. అభివృద్ధిని వదిలేసి అప్పులు రాష్ట్రంగా మిగిల్చిన ప్రభుత్వాన్ని గద్దెదించే సమయం ఆసన్నామయింది. రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే మే 13వ తేదీన గాజు గ్లాస్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని పేర్కొన్నారు.