అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 'శుభ్రత యజ్ఞం'
NGKL: సలేశ్వరం జాతర ముగిసిన నేపథ్యంలో టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో అధికారులు భారీ పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. ఏప్రిల్ 4 నుంచి 10 వరకు సిబ్బంది, వాలంటీర్లు కలిసి సుమారు 25 ట్రాక్టర్ల వ్యర్థాలను తొలగించారు. ప్లాస్టిక్ వల్ల వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని, భక్తులు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.