30 పడకల ఆస్పత్రి కోసం CMకు వినతి
BPT: సూరేపల్లిలో CM చంద్రబాబు నిన్న పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భట్టిప్రోలు(M) కేంద్రంలో సరైన వైద్య సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని రాష్ట్ర TDP కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా CMను కోరారు. అద్దేపల్లిలో BC వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని విన్నవించారు. పలు సమస్యలపై వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.