కార్వేటినగరంలో అక్రమ మద్యం స్వాధీనం

కార్వేటినగరంలో అక్రమ మద్యం స్వాధీనం

CTR: కార్వేటినగరంలో 84 బాటిల్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కార్వేటినగరం ఎస్సై తేజస్విని గురువారం తెలిపారు. మండలంలోని ఎస్ఎన్ కండ్రిగలో అక్రమ మద్యం విక్రయాలపై సమాచారం అందిందని ఆమె తెలిపారు. సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా, అదే గ్రామానికి చెందిన షణ్ముగం మద్యం విక్రయిస్తుండగా అరెస్టు చేశామన్నారు. అతని వద్ద 84 మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.