భారీగా గంజాయి పట్టివేత

భారీగా గంజాయి పట్టివేత

BDK: వరంగల్ జిల్లా రంగశాయిపేటకు చెందిన బండి వెంకటేశ్వర్లును లోతువాగు అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న లక్ష్మిదేవిపల్లి ఎస్సై రమణ రెడ్డి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అతని ఆటోలో రూ.15 లక్షల విలువైన 31.93 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.