గాజుల అలంకారంలో రాజరాజేశ్వరి.. పరవశించిన భక్తజనం
వరంగల్: ఎంజీఎం సెంటర్‌లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి శిశిర నవరాత్రుల సందర్భంగా శనివారం గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 2,20,000 గాజులతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించగా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.