చిత్తూరు-పాకాల బస్సులో పొగలు

చిత్తూరు-పాకాల బస్సులో పొగలు

CTR: చిత్తూరు-పాకాల మార్గంలో ప్రమాదం తప్పింది. ఓ అద్దె బస్సు 35 మంది ప్రయాణికులతో పూతలపట్టు మీదుగా చిత్తూరు నుంచి పాకాలకు బయల్దేరింది. బీజీమిట్టూరు వద్ద అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్‌తో బస్సులోని వైర్లు అన్నీ కాలిపోయాయి. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కన ఆపాడు. ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ దిగిపోయారు.