'పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను పరిష్కరించాలి'
KMM: కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను లోతుగా పరిశీలించారు. పరిష్కారం కోసం రెండు శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రతి కేసును పారదర్శకంగా, నిర్దిష్ట కాలపట్టికలోగా విచారించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.