'మాజీ ముఖ్య మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు'

KMR: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింలు గౌడ్ మాట్లాడుతూ.. బుధవారం రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టేకుల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.