VIDEO: వైభవంగా రథోత్సవ వేడుకలు
ADB: జైనథ్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రథోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా ఇవాళ ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చి, గ్రామ పురవీధుల గుండా స్వామి వారి ఉత్సవ విగ్రహాలను రథోత్సవంలో ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలకగా, భక్తులు స్వామి వారి నామస్మరణతో పురవీధులు మారుమ్రోగాయి.