ట్రాఫిక్‌ను పరిశీలించిన సీపీ
HYD: నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై సీపీ సజ్జనార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఇవాళ కేబీఆర్ పార్కు చుట్టూ ప్రయోగాత్మకంగా చేపట్టిన వన్ వే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ నుంచి బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్, రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వంటి ప్రాంతాల్లో వాహనాల రద్దీని పర్యవేక్షించారు.