సంగారెడ్డిలో డెంగ్యూ నివారణ ర్యాలీ

SRD: జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఉపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గాయత్రీ దేవి పాల్గొన్నారు.