అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య..కేసు నమోదు

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య..కేసు నమోదు

MBNR: అప్పుల బాధ భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబుపేట మండల పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై విక్రం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీను అనే యువకుడు కుటుంబ పోషణ కోసం అప్పులు చేయగా, వాటిని తీర్చలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు