ఉగ్రవాదులతో సంబంధాలు.. ఇద్దరిపై వేటు

ఉగ్రవాదులతో సంబంధాలు.. ఇద్దరిపై వేటు

జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఇద్దరు ఎస్పీవోలైన అబ్దుల్ లతీఫ్, మహ్మద్ అబ్బాస్‌లపై వేటు పడింది. పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల కార్యకలాపాలకు వారు సాయం చేస్తున్నట్లు తేలడంతో విధుల నుంచి తొలగించామని అధికారులు తెలిపారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దోడా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.