'రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి'
BHNG: రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆలేరు సీపీఐ(ఎం) మండల కార్యాలయంలో మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్ రైతు భరోసా నిధులను ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.