NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థికి నితీష్ మద్దతు

బీహార్ సీఎం నితీష్ కుమార్ NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు తన పార్టీ మద్దతును ప్రకటించారు. ఈ మేరకు 'X'లో పోస్ట్ చేస్తూ.. మహారాష్ట్ర గవర్నర్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం స్వాగతించదగిన నిర్ణయమని పేర్కొన్నారు. బీజేపీ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజు నితీష్ కుమార్ మద్దతు తెలిపారు. కాగా, రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.