రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి

రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి

నంద్యాల జిల్లాలోని బనగానపల్లె శాసనసభ్యుడు మంత్రి జనార్ధన్ రెడ్డి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు, నవతరం లోకేష్ కృషితో ఏపీకి పెట్టుబడుల వరద వస్తుందని ఆయన వెల్లడించారు. ఐ&ఐ శాఖతో 38 సంస్థలు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నాయని, త్వరలోనే రాష్ట్ర యువతకు వీటి ఫలాలు అందుతాయని పేర్కొన్నారు.