'పశువుల సంతలో అధికారుల ఇష్టారాజ్యం'
పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఉన్న పశువుల సంతలో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు, కాంగ్రెస్ నాయకులు సంత ప్రదేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా సంతకు వచ్చిన రైతులు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.