'సర్దార్ పాపన్న గౌడ్ కు కలెక్టర్ రాజర్షి షా ఘన నివాళి'

ADB: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమాన్ని సోమవారం అధికారికంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆయన చిత్రపటానికి అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ..17వ శతాబ్దంలోనే పోరాడిన అసమానమైన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.