పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
కామారెడ్డి జిల్లాలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షా నిర్వహించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.