ఉత్తమ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేత

NLR: ఆత్మకూరు, అనంతసాగరం మండలంలోని చిలకలమర్రి జడ్పీ హైస్కూల్‌లో గత విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రూ.10,000 నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ ప్రోత్సాహకాలను అనంతసాగరం మండల మాజీ ఎంపీపీ మునగపాటి వెంకట సుబ్బరాజు జ్ఞాపకార్థం ఆయన సతీమణి మునగపాటి సునీతమ్మ అందజేశారు.