ప్రభుత్వ భూముల ఆక్రమణపై చర్యలు అవసరం: CPI
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలంలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని CPI రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు MRO క్రాంతి కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. పోరంబోకు, చెరువు, రహదారి పక్క భూముల ఆక్రమణను అరికట్టేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, హద్దులు గుర్తించి భూములను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.