సర్పంచ్, వార్డు అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు
MBNR: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. అనంతరం పోటీలో ఉన్న సర్పంచ్ వార్డు అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. నామినేషన్ పత్రంలో అభ్యర్థి పేరు ఎలా నమోదైందో, ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగా తెలుగు అక్షర క్రమానుసారం గుర్తుల కేటాయింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.