డిపాజిట్ గల్లంతవడమంటే ఇదే

TG: ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలో అభ్యర్థి 'డిపాజిట్' కోల్పోయారనే పదం వింటూనే ఉంటాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేస్తారు. ఎన్నికలలో పోలైన ఓట్లలో ఆరో వంతు అంటే 16శాతం ఓట్లు పొందితేనే ఆ రుసుమును అభ్యర్థికి తిరిగి ఇస్తారు. లేకపోతే అది ఈసీకే చెందుతుంది.