ఆకట్టుకుంటున్న 'కార్మేని సెల్వం' టీజర్
సముద్రఖని ప్రధాన పాత్రలో రామ్ చక్రి తెరకెక్కించిన ద్విభాషా చిత్రం 'కార్మేని సెల్వం'. డబ్బు, కుటుంబం, మానవ ఆశయాల చుట్టూ తిరిగే ఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. గౌతమ్ మీనన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. లక్ష్మీ ప్రియా, అభినయ ఇతర పాత్రల్లో నటించారు. ఈ ఆసక్తికర కథాంశం కలిగిన చిత్రం ఏప్రిల్ 3, 2026న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.