'అండర్-16 బాల, బాలికల సాఫ్ట్ బాల్ పోటీలు ప్రారంభం'
BDK: కొత్తగూడెం టౌన్ రామవరం సాధన గ్రౌండ్‌లో ఆదివారం ప్రారంభమైన అండర్-16 బాల బాలికల సాఫ్ట్ బాల్ పోటీలను కొత్తగూడెం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మోరే రూప రమేష్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. సాధనా గ్రౌండ్‌లో క్రీడలను ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో పోటీలు పూర్తి చేయాలని తెలిపారు.