ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చ

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చ

సత్యసాయి: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ రానుండటంతో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లు, భద్రత అంశాలపై వారిరువురు చర్చించారు. పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు.