ఇంటర్ పరీక్షకు 5 మంది గైర్హాజరు
KMR: దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం బోటనీ, ఫిజిక్స్, మ్యాథ్స్, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. జనరల్ విభాగంలో 138 మందికి గాను 136 మంది హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 23 మందికి గాను 20 మంది హాజరయ్యారు. మొత్తం 161 మంది విద్యార్థులకు గాను 156 మంది పరీక్ష రాశారు. ఐదు మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.