శాటిలైట్ సిటీలో ఆలయాలకు ₹10 లక్షల విరాళం
E.G: రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. కంబాల శ్రీనివాసరావు వెంకటేశ్వర ఆలయానికి ₹7 లక్షలు, విగ్నేశ్వర ఆలయానికి ₹3 లక్షలు కలిపి మొత్తం ₹10 లక్షల విరాళం అందజేశారు.