మురుగు నీరు తొలగింపు

మురుగు నీరు తొలగింపు

సత్యసాయి: రొద్దంలోని గొబ్బరంపల్లిలో మెయిన్ రోడ్డు మీద నిల్వ ఉన్న మురికి నీటిని టీడీపీ నాయకులు తొలగించారు. రోడ్డుపై మురుగునీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడేవారని మంత్రి సవితమ్మ ఆదేశాలతో జేసీబీ ద్వారా తొలగించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కన్వీనర్ నరసింహులు, కో కన్వీనర్ వెంకటేశులు, ఫీల్డ్ అసిస్టెంట్ రవి పాల్గొన్నారు.