"ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నత విద్య సంస్థలను ఏర్పాటు చేయాలి"
MLG: ఏటూరునాగారం మండలంలో సోమవారం తుడుందెబ్బ మండల అధ్యక్షుడు నీలాద్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నీలాద్రి మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నత విద్యా సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. నర్సింగ్, PG, BED వంటి కోర్సుల కోసం గిరిజన విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు.