పాఠశాల భవనం కూల్చివేత
KMR: దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థలోని భవనాలను బుధవారం కూల్చివేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఆదేశాల మేరకు భవనాలను కూల్చివేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బలవంతరావు చెప్పారు. పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఆయన తెలిపారు.