ఇంటింటా అమరావతి సంబరాలు

ఇంటింటా అమరావతి సంబరాలు

ASR: అమరావతికి చట్టబద్ధత లభించడంపై రంపచోడవరం నియోజకవర్గంలో ఇంటింటా సంబరాలు నిర్వహించారు. ఏటపాక మండలం గుండాల గ్రామంలో టేకుమల్ల రూప లక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు రంగవల్లులు వేసి, హోలీ ఆడి ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. రైతుల త్యాగం ఫలించిందని, అమరావతి ఏకైక రాజధానిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.