‘నా కెరీర్‌లోనే 'రెబెకా' పాత్ర ప్రత్యేకం’
'పళ్లిచట్టంబి' చిత్రంలో ‘రెబెకా’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించినట్లు హీరోయిన్ కయాదు లోహర్ తెలిపింది. ఈ పాత్ర కోసం వర్క్‌షాప్స్‌లో పాల్గొని, కొన్ని పుస్తకాలు చదివి పరిశోధన చేశానని.. ఈ పాత్ర తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమని పేర్కొంది. గ్లామరస్‌గా కనిపించినా, వ్యక్తిగతంగా తాను ఒక సగటు అమ్మాయినేనని.. అలాంటి పాత్రలే తనకు ఇష్టమని కయాదు చెప్పింది.