VIDEO: బేస్తవారిపేటలో కురుస్తున్న వర్షం

ప్రకాశం: బేస్తవారిపేటలో బుధవారం రాత్రి వర్షం కురిసింది. ఉదయం నుండి వాతావరణం చల్లగా మారి ఒకసారిగా వర్షం పడింది. అయితే ఉరుములు మెరుపులు లేకపోవడంతో విద్యుత్ అంతరాయం కలగలేదని స్థానిక ప్రజలు తెలిపారు. కాగా, గత నాలుగు రోజుల నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.