VIDEO: 500 మందితో ఊపందుకున్న ఉపాధి పనులు

SRD: కంగ్టి మండల కేంద్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు శనివారం స్థానిక పీర్లగట్టు ప్రాంతంలోని అసైన్డ్ భూముల్లో రాళ్ల ఏరివేత అభివృద్ధి పనులు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి సుభాష్ తెలిపారు. మండలంలోని గ్రామాల్లో కంటే అత్యధికంగా 500కు పైగా కూలీలు ఉపాధి పనులు చేపడుతున్నారని తెలిపారు.